నట కిరీటీ సాలిడ్‌ స్టేట్మెంట్‌!

నట కిరీటీ సాలిడ్‌ స్టేట్మెంట్‌! టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో యూత్ స్టార్ నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “రాబిన్ హుడ్”. నితిన్ అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఇది వరకే రిలీజ్ కావాల్సి ఉంది కానీ మేకర్స్ ఈ మార్చ్ కి షిఫ్ట్ చేశారు. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటులు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కూడా కీలక పాత్ర పోషించగా తాను ఈ సినిమా విషయంలో అలాగే నితిన్ పరంగా చేసిన ఓ సాలిడ్ స్టేట్మెంట్ ఇపుడు వైరల్ గా మారింది.

నితిన్ రాబిన్ హుడ్ సినిమా తర్వాత తన రేంజ్ ఖచ్చితంగా మారిపోతుంది అని చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఒకవేళ అలా జరగకపోతే తాను ఇంకెప్పుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యను అని తెలిపారు. దీనితో ఈ సినిమా పట్ల రాజేంద్ర ప్రసాద్ ఎంత బలమైన నమ్మకంతో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ అవైటెడ్ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. అలాగే ఈ మార్చ్ 28న గ్రాండ్ గా రిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories