సేతుపతి సినిమాకి రాజాసాబ్‌ బూస్ట్‌!

తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి, చక్కటి నటిగా పేరున్న నిత్యా మీనన్ కలిసి నటించిన తాజా చిత్రం “తలైవన్ తలైవీ” తమిళంలో మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో “సార్ మేడమ్” పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఈ చిత్రం తెలుగులో ఎంతవరకు ఆకట్టుకుంటుందో అనే ఆసక్తి మదిలో ఉండగానే, డార్లింగ్ ప్రభాస్ ఇచ్చిన ఒక చిన్న మద్దతు ఈ సినిమాకు భారీ బలాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. ప్రభాస్ ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ చూసినట్లు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తెలిపారు. సినిమా కథలో భావోద్వేగాలు బాగా పండించారని, ఇది ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది అని అభిప్రాయపడ్డారు. ఆయన తరఫున చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య పెరుగుతున్న అపార్థాలు, వాటి వల్ల వారి జీవితాల్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి అనే దాన్ని కథానాయికా కథానాయకుల అభినయంతో సహజంగా చూపించారు. దర్శకుడు పాండిరాజ్ ఈ సినిమాను ఓ డీప్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు. అలాగే యోగి బాబు చేసిన పాత్ర కూడా సినిమాకు హాస్యాన్ని మేళవించి ప్రేక్షకులకు మరింత ఆసక్తిని కలిగించేలా ఉంటుంది.

ఇప్పటికే తమిళనాట ప్రశంసలు పొందిన ఈ సినిమా, తెలుగులో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందేమో అనే విషయం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ మద్దతుతో సినిమాకు మరింత ప్రాముఖ్యత వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories