బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇస్తున్న రాజాసాబ్ బ్యూటీ!

రీసెంట్ గా కోలీవుడ్ సినిమా దగ్గర మొట్ట మొదటిసారి తన అభినయం తో అందరికీ షాకిచ్చిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది హీరోయిన్‌  మాళవిక మోహనన్ అనే చెప్పాలి. చాలా చిత్రాల్లో సింపుల్ గా కనిపిస్తూ నార్మల్ రోల్స్ లోనే కనిపించి మెప్పించింది. కానీ మొదటిసారి ఒక మంత్రగత్తెగా ఊహించని గెటప్ అందుకు తగ్గట్టుగా క్రేజీ పెర్ఫామెన్స్ తో చియాన్ విక్రమ్ నటించిన “తంగలాన్” లో నటించి అబ్బురపరిచింది.

మరి ఇప్పుడు మాళవిక తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో “ది రాజాసాబ్” సినిమా చేస్తూ తెలుగులో ఎంట్రీ ఇస్తుండగా ఈ సినిమా కంటే ముందే హిందీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈమె హిందీలో నటిస్తున్న తాజా సినిమానే “యుధ్ర”. మరి ఈ సినిమా నుంచి తన ఫస్ట్ లుక్ ని ఆమె షేర్ చేసుకుంది. యంగ్ అండ్ టాలెంట్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది సరసన మాళవిక యాక్ట్‌ చేస్తుంది. చిత్రాన్ని రవి ఉద్యవర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక దీని నుంచి మాళవిక మోహనన్ ఫస్ట్ లుక్ షేర్ చేసింది. ఇందులో తాను స్టన్నింగ్ గా కనిపిస్తూ నిఖత్ అనే పాత్రలో కనిపిస్తున్నట్టుగా మూవీ టీమ్‌ పరిచయం చేసింది. ఒక పర్ఫెక్ట్ బాలీవుడ్ యాక్షన్ సినిమా పోస్టర్ తరహాలో మాళవిక అభిమానులకు పరిచయం అయ్యింది. మరి ఈ సినిమాలో తన రోల్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 20న విడుదల కాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories