రాజమౌళి సలహా నా జీవితాన్నే మార్చేసింది: అలియా!

సినిమాల విషయంలో టాలీవుడ్ అగ్ర దర్శకుడు జక్కన్న సలహాను ఫాలో అవుతాను అంటుంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అలియా భట్‌. ఆర్ఆర్‌ఆర్‌ సినిమా చేస్తున్న సమయంలో ఆయన నాకు ఇచ్చిన సలహాలు నాకు ఇప్పుడూ, ఎప్పుడూ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని జక్కన్న ను తెగ పొగిడేస్తుంది ఈ అమ్మడు.

రాజమౌళి తనతో అన్న మాటలు తన మీద మంత్ర శక్తిలా పని చేశాయని చెప్పింది అలియా. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన సమయం నుంచి కూడా కథల ఎంపిక విషయంలో కాస్త కన్ఫ్యూజన్‌ ఉండేది.. ఈ విషయం గురించి ఎన్నో సార్లు ఒత్తిడికి లోనైన సందర్భాలు కూడా ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది.

ఆ సమయంలో రాజమౌళి నాతో ..” మీరు ఏ కథను ఎంచుకున్నప్పటికీ…అందులో మీ పాత్రను బాగా ప్రేమించండి.. అంకిత భావంతో శ్రమించండి. అప్పుడు సినిమా ప్రేక్షకులు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నప్పటికీ మీ నటనను మాత్రం కచ్చితంగా మెచ్చుకుంటారు. ప్రేమిస్తారు. మీరు ప్రేమతో చేసే పనికి మించిన గొప్ప సంతృప్తి ఇంకొటి ప్రపంచంలో దొరకదు అని అన్నారంట.

అప్పటి నుంచి కూడా ఆ సలహా పాటిస్తూ ప్రతి సినిమాలోని పాత్రను ప్రేమించడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి నా పద్దతి పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చింది.

Related Posts

Comments

spot_img

Recent Stories