దొంగ తప్పుడు పాలసీలను తయారుచేసి.. ప్రజాధనాన్ని దోచుకోవడం ఎలా..? అనే సబ్జెక్టులో పీహెచ్డీ చేసిన మాస్టర్ బ్రెయిన్ రాజ్ కెసిరెడ్డి! కాబట్టే.. మూడున్నర వేల కోట్లరూపాయల బ్లాక్ మనీని డిస్టిలరీల యజమానుల నుంచి వసూళ్లు చేసే కీలక బాధ్యతను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అతని భుజస్కంధాల మీద పెట్టారు. రాజ్ కెసిరెడ్డి ఒక పెద్ద ప్రెవేటు నెట్ వర్క్ ను, ముఠాను ఏర్పాటుచేసుకుని.. ఆ బాధ్యతను చాలా సక్రమంగా నిర్వర్తించాడు. ఏకంగా తాను సీఎం పేషీనుంచి ఫోను చేస్తున్నట్టుగా డిస్టిలరీల యజమానులకు ఫోన్లు చేసి బెదిరిస్తూ.. తనకు కావాల్సిన విధంగా వాటాలు ముట్జజెప్పేలా లొందీసుకున్నాడు. వేల కోట్లరూపాయలను తన నెట్వర్క్ ద్వారా.. పోగేశాడు. ఈ క్రమంలో ఈ కుంభకోణంలో ఇతర సూత్రధారుల్లో ఎవరెవరికి ఎంతెంత వాటాలు అందాల్నో ఆ మొత్తాలను వారికి నెలవారీగా పంపేశాడు. మొత్తం వ్యవహారంలో తన చిలక్కొట్టుడు టేలెంట్ ను కూడా ప్రదర్శించి తన వంతుగా వందల కోట్లు కాజేశాడు. ఇప్పుడు వరుస పెట్టి.. రాజ్ కెసిరెడ్డి ఆస్తులు, లిక్కర్ దోపిడీ పర్వం సాగిన పీరియడ్ లో ఆయన తన బినామీల పేరుతో కొన్న ఆస్తులు అన్నిటినీ వరుసపెట్టి పోలీసులు జప్తు చేస్తున్నారు. కోర్టు అనుమతులు తీసుకుని మరీ ఈ జప్తుల పర్వం కొనసాగిస్తున్నారు.
రాజ్ కెసిరెడ్డి లిక్కర్ కుంభకోణంలో కాజేసిన సొత్తుతో హైదరాబాద్ నడిబొడ్డున, చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్న భూములు, స్థలాలు, బినామీ పేరుతో పెట్టిన బ్యాంకు ఖాతాలోని డబ్బును జప్తు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అధికారికంగా పదిన్నర కోట్ల దాకా వాటి విలువ ఉండగా.. మార్కెట్ ధర ప్రకారం 50 కోట్లు పైగానే విలువచేస్తాయని అనుకుంటున్నారు.
రాజ్ కెసిరెడ్డి 2021 ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరి మధ్య ఏడునెలల కాలంలోనే.. ఈ భూములన్నీ కొన్నట్టుగా సిట్ గుర్తించింది. వాటికోసం పెట్టిన డబ్బులన్నీ లిక్కర్ కుంభకోణం సొమ్ములే అని కూడా తేల్చింది. ఏదో తాను దోచుకోవడానికి ఈ పథకం వేసి.. రాజ్ కెసిరెడ్డి ని వాడుకోవాలనిచూస్తే.. ఆయన ఈ స్థాయిలో చిలక్కొట్టుడు కొట్టడం తెలిస్తే బిగ్ బాస్ ఊరుకోడేమో అని కూడా పలువురు అంటున్నారు.
ఆయన అనేక బినామీ కంపెనీల పేర్లతో కూడా దందాలు నడిపించినట్టుగా సిట్ గుర్తించింది. ఆయా బినామీ కంపెనీల బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్ములను కూడా జప్తు చేయడానికి సిట్ సిద్ధం అవుతోంది. రాజ్ కెసిరెడ్డి ఆస్తుల్లో ఇప్పుడు హైదరాబాదు చుట్టుపక్కల 30 ఎకరాలు, గచ్చిబౌలిలో 326 గజాల స్థలం, బినామీ కంపెనీ ఖాతాలోని 3 కోట్ల నగదును జప్తు చేయబోతున్నారు.