రాధ వచ్చేసింది!

కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ “క”. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్‌ లో స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్నాడు యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం. ఇండస్ట్రీలో చాలా కాలంగా హిట్టు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు ఈ యంగ్ హీరో. రొటీన్ కథలకు స్వస్తి చెప్పి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో, రాయలసీమ యాక్షన్ నేపథ్యంలో సాగే కథాంశాన్ని ఎంచుకొని అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తన పుట్టిన రోజు జులై 15న చిత్రం ట్రైలర్ ని మూవీ టీమ్‌ విడుదల చేసింది. తాజాగా “క”చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై విడుదల  చేయబోతున్నారు.“క” సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో రూపొందిస్తున్నారు.

దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్న ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్‌ విడుదల చేయబోతున్నారు. తాజాగా “క” సినిమా నుంచి బ్యూటిఫుల్ హీరోయిన్ తన్వీ రామ్ నటిస్తున్న రాధ క్యారెక్టర్ ఫస్ట్ లుక్  అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు.  

ఈ పోస్టర్ లో ట్రెడిషినల్ లుక్ లో దాండియా ఆడుతూ అందంగా ఆకర్షణీయంగా ఉంది. ఆమె చేస్తున్న రాధ క్యారెక్టర్ కు “క” సినిమాలో మంచి ఇంపార్టెన్స్ ఉండనుంది. సూపర్‌ హిట్‌ సినిమా అయిన “2018” తో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన తన్వీ రామ్ ఇప్పుడు “క” సినిమాతో మరోసారి టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. 

Related Posts

Comments

spot_img

Recent Stories