ఇందులో పుష్ప 2.0 చూస్తారంటున్న ముద్దుగుమ్మ!

ఛలో అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అమ్మడు రష్మిక. ఈ కన్నడ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. అంతే కాకుండా బాలీవుడ్ లో అడుగుపెట్టి రికార్డులు తిరగరాసుకుంది. చేతినిండా సినిమాలతో ఈ ముద్దుగుమ్మ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.

పుష్ప సినిమాలో శ్రీవల్లిగా అందరి మనసులు దోచుకున్న రష్మిక…ప్రస్తుతం… పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. పుష్ప బాక్సాఫీస్‌ వద్ద ఎంత పెద్ద విజయాన్నిసాధించిందో అందరికీ తెలిసిందే. ఆగస్టులో విడుదలకు సిద్దంగా ఉన్న పుష్ప 2 సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది.

ప్రస్తుతం ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అంతేకాదు ఎడిటింగ్ వర్క్ ను కూడా మొదలు పెట్టేశారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఆమె  పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే బన్నీ బర్త్‌ డే సందర్భంగా టీజర్ ను కూడా విడుదల చేశారు. ఆ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.. భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది.

తాజాగా ఈ సినిమా గురించి రష్మిక మందన్న షాకింగ్ కామెంట్స్ చేసింది. రష్మిక ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను చెప్పింది.. ఈ సినిమాలో తన పాత్ర ఛాలెంజ్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది. మొదట పుష్ప సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను. ఆ సినిమా కథ ఏంటి? శ్రీవల్లి పాత్ర ఎలా ఉంటుంది? స్క్రీన్ మీద ఎలా చూపిస్తారు? ఇంతకీ జనాలకు ఏం చూపించబోతున్నారు? అనే విషయాలను పెద్దగా పట్టించుకోలేదు.

అలాగే ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, ‘పుష్ప 2’లో శ్రీవల్లి 2.0ను చూస్తారని రష్మిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఆగస్టు 15 న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యనున్నారు..

Related Posts

Comments

spot_img

Recent Stories