పుష్ప 2 ప్రీమియర్‌ మొదలయ్యేది అప్పుడే!

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప – 2. అత్యంత భారీ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక  హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.

 ప్రస్తుతం చిత్ర షూటింగ్  మూడు యూనిట్స్ తో చక చక ఫినిష్ చేసే పనిలో పడ్డాడు దర్శకుడు సుక్కు. పుష్ప -2 డిసెంబరు 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దంగా ఉంది. కాగా పుష్ప – 2 ఎటువంటి పోటీ లేకుండా అత్యధిక థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ పుష్ప – 2 కు సోలో విడుదల దక్కింది.

 పుష్ప – 2 రేంజ్ ఏపాటిదో తెలుసుకోవచ్చు. కాగా దేవర రిలీజ్ విషయంలో ఓవర్సీస్ తో పాటు తెలుగు స్టేట్స్ ఒకేసారి ప్రీమియర్స్ ఎలా అయితే వేసారో అదే ట్రెండ్ ను పుష్ప – 2 కు ఫాలో చేయాలని చూస్తున్నారు మేకర్స్‌ భావిస్తున్నారు. డిసెంబరు 6న విడుదల అయితే ముందు రోజు అంటే డిసెంబరు 5న రాత్రి 9.30 నిముషాలు నుండి కంటిన్యూ ఆటలు వేయడానికి ప్రణాళిక రెడీ చేస్తున్నారు. మైత్రి మూవీస్ నిర్మాతలు. అంటే ఓవర్సీస్ కంటే ముందు తెలుగు రాష్ట్రాల్లో షోస్ పడతాయి. టాక్ బాగుంటే ఇక పుష్ప – 2 తొలి రోజు రికార్డు స్థాయి లో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories