భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తో పుష్ప 2 ఇంటర్వెల్‌ సీన్‌!

జాతీయ నటుడు అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. లెక్కల మాస్టర సుకుమార్‌ కాంబోలో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌ గా రాబోతున్న పుష్ప 2 మీదే ఇప్పుడు అందరి చూపు ఉంది.

ఈ సినిమాను చిత్ర బృందం ఆగస్టు 15 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ,టీజర్ ,సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.  ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మేకర్స్ అదిరిపోయే ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ సాంగ్ లో యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి నటిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.పుష్ప 2 లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ సీన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఈ ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలైట్ గా నిలవనున్నట్లు సమాచారం. ఈ సారి పుష్ప 2 సినిమా మరింత ఇంట్రస్టింగ్ గా ఉండబోతుందని సమాచారం.ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories