షూటింగ్‌ మొదలు పెట్టిన పూరి-సేతుపతి మూవీ!

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా కాలం తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టారు. మరీ విశేషంగా చూస్తే తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతితో కలిసి ఈ సినిమా చేయటం విశేషమే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ అయిపోయింది. ప్రస్తుతం యూనిట్ షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్తోంది. నటీనటుల ఎంపిక పనులు పూర్తయ్యి, షూటింగ్ కూడా మొదలు పెట్టారు.

హైదరాబాద్‌లో స్పెషల్‌గా రూపొందించిన సెట్లో సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను తాజాగా మొదలు పెట్టారు. మొదటి షెడ్యూల్‌లో విజయ్ సేతుపతితో పాటు సంయుక్త మీనన్ కూడా పాల్గొంటున్నారు. వీరిద్దరిపై కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. యాక్షన్‌, డ్రామా మిక్స్‌గా కొన్ని ముఖ్యమైన సీన్లను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించబోతున్నట్టు సమాచారం.

ఇందులో టాలెంటెడ్ నటి టబు, విలన్‌గా దునియా విజయ్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పూరి జగన్నాథ్ తన బ్యానర్ పూరి కనెక్ట్స్ మీద ఛార్మితో కలిసి నిర్మిస్తున్నారు. విజయ్ సేతుపతి టాలెంట్‌కు, పూరి డైరెక్షన్‌కు ఫ్యాన్స్‌లో భారీగా ఆసక్తి నెలకొంది. ఈ కాంబినేషన్ నుంచి ఏ రేంజ్ ఎంటర్టైనర్ వస్తుందో అని ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories