విజయ్‌ సినిమా ప్రారంభించిన పూరి!

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ క్రేజీ సినిమా ప్రారంభం కాబోతుందనే వార్త ఇప్పటికే సినీప్రే‌మికుల్లో ఆసక్తిని రేపింది. ఈ ప్రాజెక్ట్ పట్ల అభిమానుల్లో నెలకొన్న అంచనాలు మొదటి రోజు నుంచి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపోతే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది.

ఇప్పటికే సినిమా గురించి అధికారికంగా ప్రకటించిన మేకర్స్, ఇటీవలే భవ్యంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి లాంచ్ చేశారు. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ కలిసి నిర్వహిస్తున్న ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. అయితే ఇప్పుడు మరో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన జెబి మోషన్ పిక్చర్స్ కూడా ఈ సినిమాలో భాగమైంది. ఈ బ్యానర్ తరఫున జెబి నారాయణ రావు కొండ్రొల్ల ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్‌తో కలిసి నిర్మించనున్నారు.

విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త మీనన్ నటించనుండగా, విలన్ పాత్రలో దునియా విజయ్ కనిపించనున్నాడు. అలాగే టబు కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించేందుకు మేకర్స్ ఇప్పటికే పక్కా ప్లాన్‌ చేసుకున్నారు. అన్ని దశల్లోనూ భారీగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories