డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల విషయంలో ఎప్పుడూ కొత్తదనం చూపించాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ గతంలో వచ్చిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆయనపై చాలా ఒత్తిడి వచ్చింది. ఇప్పుడు ఆ ఒత్తిడినే ఛాన్స్‌గా మార్చుకుంటూ విజయ్ సేతుపతి హీరోగా కొత్త సినిమా బెగ్గర్‌ను ప్లాన్ చేశాడు. పూరి కెరీర్‌లో ఇంతవరకు తీసిన సినిమాలకన్నా ఈ సినిమా స్టోరీ, ప్రెజెంటేషన్ వేరుగా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై పూరి బాగా కసరత్తులు చేస్తున్నాడట. త్వరలోనే ఒక లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తూ యాక్షన్ సీన్స్‌తో పాటు ఓ పాటను కూడా షూట్ చేయబోతున్నారని సమాచారం. ఆ సాంగ్ ద్వారా విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ని మరింత బలంగా ప్రేక్షకులకు పరిచయం చేయాలని భావిస్తున్నారట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాడని చెబుతున్నారు.
ఇదివరకటి పూరి స్క్రిప్ట్‌లతో పోలిస్తే, బెగ్గర్ కథ బలంగా, కొత్త కోణాల్లో రాసినట్లు ఫిల్మ్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. విజయ్ సేతుపతి పాత్రకు మూడు వేర్వేరు షేడ్స్ ఉన్నాయని కూడా టాక్ వినపడుతోంది.