డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత కొత్త సినిమా కోసం రెడీ అయ్యాడు. ఉగాది సందర్భంగా విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ సినిమా తెరకెక్కించన్నట్టు నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమా కథ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. నేటి రాజకీయాల పై ఈ చిత్రం ఉండబోతుందట. పైగా సినిమాలో పొలిటికల్ సెటైర్లు చాలా ఉంటాయని.. నేటి సమాజానికి తగ్గట్టు పూరి స్క్రిప్ట్ రెడీ చేశాడని తెలుస్తోంది.
సహజంగా పూరి డైలాగ్స్ లో డెప్త్ ఉంటుంది. మరి రాజకీయాల పై ఎలాంటి డైలాగ్స్ పేలుస్తాడో చూడాలి. ఐతే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన “డబుల్ ఇస్మార్ట్” ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ ను తెచ్చుకోలేక పోయింది. ముఖ్యంగా పూరి గత సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాలో బలమైన కంటెంట్ మిస్ అయ్యింది అంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో పూరి, విజయ్ సేతుపతి కోసం బలమైన కథను రాశాడట.