న్యాయం కావాలి : తంగెడలో రీపోలింగ్ పెట్టాల్సిందే!

ఓటమి భయం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారితో అనేక అరాచకాలు చేయించింది. అసలు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ రోజున విధ్వంసాలు సృష్టించడం, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం ద్వారా ఓటింగ్ శాతం తక్కువ జరిగేలా చూడాలని చాలాకాలం కిందనుంచే వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా సమాచారం వ్యాప్తిలోకి వచ్చింది. పోలింగ్ నాడు చాలా చోట్ల అలాంటి ప్రయత్నాలు జరిగాయి గానీ.. పెద్ద ఎత్తున జరగలేదు. చెదురుమదురు అల్లర్లు జరిగినా.. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రజలు.. అక్కడినుంచి కదలలేదు. ఓటు వేసి తీరాలన్నట్టుగా అక్కడే ఉండిపోయారు. అయితే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పరిధిలోని తంగెడలో జరిగిన సంఘటనలు.. వైసీపీ వారి అరాచకమైన దాడులు, చేసిన విధ్వంసం క్యూలైన్లో ఉన్న ఓటర్లందరూ ప్రాణభయంతో పారిపోయే పరిస్థితిని కల్పించాయి. ఈ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించి తీరాల్సిందేనని, లేకపోతే వైసీపీ వారి అరాచకాలను ప్రోత్సహించినట్టు అవుతుందని పలువురు భావిస్తున్నారు.
గురజాల నియోజకవర్గం పరిధిలోని దాచేపల్లి మండలం తంగెడలో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు నాటుబాంబులు, పెట్రోలు సీసాలతో దాడులకు తెగబడ్డారు. ఓటమి భయంతో ఇాది వైఎస్సార్ కాంగ్రెస్ వారు వ్యూహాత్మకంగా చేసిన దాడులుగా ప్రజలు భావిస్తున్నారు. ఈ దాడులు సరిగ్గా పోలింగ్ ముగుస్తున్న సమయానికి, అంటే, ఆరుగంటల సమయంలో జరిగాయి. ఆరుగంటల తర్వాత కూడా పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరి నిల్చుని ఉన్నారు. 6 గంటల వరకు క్యూలైన్లోకి వచ్చిన చివరి ఓటరు కూడా ఓటు వేసే వరకు పోలింగ్ జరుగుతుందన్నది అందరికీ తెలిసిందే. అయితే పోలింగ్ శాతం బాగా పెరిగితే.. తమకు నష్టం జరుగుతుందనే భయంతో వైసీపీ వర్గీయులు తెలుగుదేశం వారితో తొలుత ఘర్షణ పడ్డారు. అంతలోనే నాటుబాబులతోను, పెట్రోలు సీసాలతోను దాడులు చేశారు. ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఏర్పడింది.
ఈ విధ్వంసం మొదలు కాగానే.. పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరి ఉన్న ఓటర్లందరూ ప్రాణభయంతో పరుగులు తీశారు. వాళ్లెవ్వరూ ఓట్లు వేయకుండా చూడడానికే వైసీపీ వారు ఇలాంటి కుట్రలు, దాడులు చేసినట్టుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యం బతకాలంటే.. తంగెడలో రీపోలింగ్ నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా మాత్రం.. పోలింగ్ అధికారులు నివేదికను బట్టి రీపోలింగ్ పెడతాం అంటున్నారు. కానీ తంగెడలో అల్లర్లు, విధ్వంసాన్ని పట్టిచుకుని రీపోలింగ్ పెడితేనే న్యాయం జరుగుతుందని పలువురు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories