ఆస్తి వివాదాలు..జగన్‌ బెయిల్‌ రద్దయ్యే అవకాశాలు!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు, ఏపీసీసీ అధ్యక్షురాలు , ఆయన చెల్లెల్లు అయిన వైఎస్‌ షర్మిలకు గత కొన్ని సంవత్సరాలుగా ఆస్తి తగాదాలు జరుగుతున్నయనే విషయం అడపాదడపా బయటకు వచ్చింది. తన ఆస్తిలో షర్మిలకు ఏమీ ఇచ్చేది లేదని జగన్ అనుకున్నప్పటికీ .. ఇప్పుడు చచ్చినట్లు ఆస్తి పంపకాలకు ముందుకు వచ్చినట్లు ప్రచారాలు సాగాయి. బెంగళూరులోనే వీటికి సంబంధించిన చర్చలు జరిగినట్లు వార్తలు నడిచాయి

ప్రస్తుతం తాను ఒంటరిగా ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని అనుకుంటున్న జగన్.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ లో కలవడమో…లేక కాంగ్రెస్‌నే కలుపుకోవడమో అనే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. దీంతో జగన్, షర్మిల రాజీకి వచ్చేశారని అనుకున్న తరుణంలో వస్తున్న ఈ అంచనాలకు భిన్నంగా మరో ఊహించని విషయం అందరి ముందుకు వచ్చింది.

ఈ వ్యవహారంపై జగన్‌, తన భార్య భారతితో కలిసి.. సెప్టెంబర్ 9న షర్మిల, విజయమ్మపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో పిటిషన్ దాఖలు చేశారు. ఆస్తి పంపకాల విషయంలో సొంత తల్లి, చెల్లిపై కోర్టులో ఫిర్యాదు చేసిన వ్యవహారం తాజాగా వెలుగులోకి రావడం రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. సరస్వతి పవర్‌ షేర్ల వివాదంపై క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, జగన్, భారతి రెడ్డి పేర్లతో మొత్తం ఐదు పిటిషన్లు వేశారు.

మొదట్లో తన సోదరి షర్మిలకు వాటాలు కేటాయించాలని అనుకున్నానని.. కానీ కొన్నేళ్లుగా ఆమె తనకు వ్యతిరేకంగా రాజకీయం చేయడంతో పాటు తన పై విమర్శనాస్త్రాలను సంధిస్తుండడంతో వాటాలను తిరిగి తీసుకుంటున్నట్లు జగన్ పిటిషన్‌లో తెలిపారు. అయితే 2019, ఆగస్టు 21న MOU ప్రకారం విజయమ్మ, షర్మిలకు షేర్లు కేటాయించామని.. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కేటాయింపులు జరగలేదని తెలిపారు.

అందుకే ఇప్పుడు ఆ షేర్లను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు అయితే NCLT ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసి, తరువాత విచారణను నవంబర్ 8కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

బెయిల్ రద్దు అయ్యి.. జగన్ అరెస్ట్ అయ్యే…
అయితే ఈ వ్యవహారం అంతా ఇలా ఉంటే…భారతి సిమెంట్స్ తో పాటు, సరస్వతి పవర్ ఆస్తులను 2016లో ఈడీ అటాచ్ చేసింది. అయితే.. ఈ ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల పంపకం 2019లో జరిగిందని జగన్, షర్మిల ఇద్దరు చెబుతున్నారు. ఇది బెయిల్ కండిషన్లను ఉల్లంఘించినట్లు అయ్యింది. దీంతో బెయిల్ రద్దు అయ్యి.. జగన్ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ అంశాన్ని న్యాయ నిపుణులు ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories