కూతురు పేరు మీద సోషల్‌ మీడియా ఖాతా తెరిచిన ప్రియాంక చోప్రా!

ఇటీవల ముంబైలో జరిగిన తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఎంగేజ్‌మెంట్ కు హాజరైన హాలీవుడ్‌, బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా జోనాస్ తన కుమార్తె మాల్తీ మేరీ జోనాస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నూతనంగా క్రియేట్ చేసింది. బుధవారం.. ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన కుమార్తె చిత్రాన్ని మరోసారి అభిమానులతో పంచుకుంది. తన కుమార్తె  అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను కూడా పేర్కొంది. ప్రియాంక, ఆమె భర్త నిక్ జోనాస్ తమ కుమార్తెకు సంబంధించిన ఎలాంటి ఫొటోలు బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు.

సోషల్ మీడియాలో చిన్నారి ముఖాన్ని చూపించ లేదు. కానీ నటి ఇప్పుడు తన కుమార్తెకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను క్రియేట్‌ చేసింది. maltimarie పేరుతో ఖాతాను ఓపెన్ చేసిన ప్రియాంక చోప్రా.. దీనికి సంబంధించిన వివరాలను తన స్టోరీలో పంచుకుంది.ప్రియాంక తన సోదరుడి నిశ్చితార్థ వేడుక కోసం ఇండియాకు వచ్చింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రాకు ఆగస్టు 23న ముంబైలో తన సహానటి నీలం ఉపాధ్యాయ్‌తో నిశ్చితార్థం జరిగింది. ఈ ఫంక్షన్ లో ప్రియాంక అద్భుతమైన చీరను ధరించి అందరినీ అకర్షించింది. కాగా.. ప్రియాంక త్వరలో తన స్పై-థ్రిల్లర్ స్ట్రీమింగ్ షో ‘సిటాడెల్’ రెండవ భాగంలో కనిపించి మెప్పించనుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories