టాలీవుడ్ ముద్దుగుమ్మలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కొద్ది రోజుల క్రితం రకుల్ తన ప్రేమికుడు జాకీ భగ్నానీతో వివాహ బంధంలో కి అడుగుపెట్టింది. పవన్ కల్యాణ్ సరసన ఆడిపాడిన కృతి కర్బాందా కూడా తన వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది. అదితిరావు కూడా నటుడు సిద్దార్థ్ ను నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.
వీరి లిస్ట్ లోకి ఇప్పుడు తాజాగా మరో నటి కూడా వచ్చి చేరబోతుంది. ఆమె పెళ్లి చేసుకోబోయేది కూడా బాలీవుడ్ స్టార్ నటి… ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్దార్థ చోప్రాను. ఇంతకీ ఆ నటి ఎవరంటే… నీలం ఉపాధ్యాయ. ఆమె మిస్టర్ 7 అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది.
అల్లరి నరేష్ పక్కన యాక్షన్ 3డీ, తమాషా వంటి సినిమాల్లో నటించింది.
వీటితో పాటు రెండు మూడు తమిళ సినిమాలు కూడా చేసింది. ఇప్పుడు సిద్దార్థ్ చోప్రాను పెళ్లాడబోతుంది. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది నీలం .ప్రస్తుతం వీరిద్దరికి రోకా జరిగినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు ప్రముఖ నటి ప్రియాంక, ఆమె భర్త నిక్ జోనాస్ కూడా హాజరయ్యారు. సిద్దార్థ్ ఫ్లోరల్ షూట్ ధరిస్తే.. నీలం సంపద్రాయ దుస్తుల్లో మెరిసిపోతుంది.
ప్రియాంక రెడ్ కలర్ చీరలో మెరవగా.. ఆమె భర్త నిక్ జోనస్ సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశాడు . ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.