జక్కన్న మూవీలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌!

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ కాంబోలో రాబోతున్న బిగ్గెస్ట్‌ పాన్‌ వరల్డ్‌ మూవీ రూపుదిద్దుకుంటుంది. మహేష్‌ గుంటూరు కారం సినిమా తరువాత జక్కన్న తో సినిమా చేయబోతున్నాడు. దీంతో  మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఖుషీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమా గురించి చిత్రం బృందం త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యారు. . ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో ఓ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను తన గత సినిమాల కంటే మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాను ఆఫ్రికా అడవుల్లో గ్రాండ్ విజువల్స్ తో షూట్ చేస్తారని సమాచారం.ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కాస్టింగ్ గురించి ఎలాంటి న్యూస్ లేకపోయినా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా రాజమౌళి సినిమా ఆఫర్ గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories