ప్ర‌శాంత్ వ‌ర్మ – మోక్ష‌జ్ఞ‌…. అంతా స‌ర్దుకొన్న‌ట్టే!

నంద‌మూరి అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తోంది నందమూరి నటవారసుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించే. బాలయ్య బాబూ కూడా యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌  ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు ఈ ప్రాజెక్ట్ అప్ప‌గించారు. కొంతకాలం క్రితం వరకు కూడా  ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకొన్నార‌ని, ఈ సినిమా ఇక ముందుకు వెళ్ల‌ద‌ని, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో మోక్షు డెబ్యూ ఉంటుంద‌ని ప్ర‌చారం సాగింది.

అయితే ఇప్పుడు ఓ కీల‌క ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో సినిమా ఆగిపోలేద‌ని, ఈ ప్రాజెక్టుపై వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అబద్దాలని, త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. ఈ కాంబోలో సినిమా ఉంటుంద‌ని, కాక‌పోతే కాస్త ఆల‌స్య‌మవుతుంద‌ని సమాచారం.

నిజానికి ప్ర‌శాంత్ వ‌ర్మ‌కీ మోక్ష‌జ్ఞ కీ కొన్ని విష‌యాల్లో అభిప్రాయ బేధాలు వచ్చాయని  అందుకే ఈ ప్రాజెక్టు ముందుకు కదలడం లేదని అంతా అనుకున్నారు. వాటిలో కొంత నిజం ఉన్న మాట కూడా వాస్త‌వ‌మే. ప్ర‌శాంత్ వ‌ర్మ కూడా ఇక  మోక్ష‌జ్ఞ సినిమాపై ఆశ‌లు వ‌దులుకొని, ప్ర‌భాస్ తో సినిమా ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అయ్యాడు. అయితే ఈలోగా బాల‌కృష్ణ రంగంలోకి దిగారు. ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు స‌ర్దిచెప్పి, మ‌ళ్లీ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చినట్లు సమాచారం.

ఎందుకంటే ఈ సినిమాపై ఇప్ప‌టికే చాలాకాలంగా ప్ర‌శాంత్ వ‌ర్మ పని చేస్తున్న సంగతి తెలిసిందే. చాలామంది ఆర్టిస్టుల‌కు, టెక్నీషియ‌న్ల‌కు అడ్వాన్సులు ఇచ్చారు. ఈ క‌థ మోక్ష‌జ్ఞ‌కు త‌ప్ప ఇంకెవ్వ‌రికీ సెట్ అవ్వ‌ద‌ని సమాచారం. అందుకే ప్ర‌శాంత్ వ‌ర్మ కూడా ఈ సినిమాని ఎలాగైనా ప‌ట్టాలెక్కించాల‌ని అనుకుంటున్నారంట. ఇప్పుడు బాల‌య్య స‌యోధ్య‌తో మార్గం సుగ‌మం అయ్యింది.

Related Posts

Comments

spot_img

Recent Stories