పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా సినిమా సెట్స్ నుంచి ఇద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫొటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో మంచి హంగామా క్రియేట్ చేశాయి.
రాశి ఖన్నా తన సోషల్ మీడియా అకౌంట్‌లో శ్రీలీలతో తీసుకున్న సెల్ఫీని షేర్ చేస్తూ, షూటింగ్ మధ్యలో ఈ చిన్నది తనను కలిసేందుకు వచ్చిందని చెప్పింది. దీంతో ప్రస్తుతం సినిమా కోసం ఇద్దరి సీన్లు వేర్వేరుగా చిత్రీకరిస్తున్నారని అర్థమవుతోంది.