హంస నందిని హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టి పలు సినిమాల్లో నటించింది. అయితే.. హీరోయిన్గా అంత గుర్తింపు రాలేదు. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్‌తో సినిమాల్లో అదరగొట్టింది. అంతా బాగానే సాగుతుంది అనుకున్న సమయంలో క్యాన్సర్ ని పలకరించింది. ఆ తరువాత విదేశాల్లో చికిత్స తీసుకుని పూర్తిగా నయం కావడంతో ఇండియా చేరుకున్న హంస నందిని.. ఈ మధ్య కాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. పాన్ ఇండియా నటుడు ప్రభాస్‌పై ఆసక్తికర కామెంట్లు చేసింది.‘ప్రభాస్‌కి సిగ్గు ఎక్కువ. అందుకే ఎవరితోనూ మాట్లాడరు. ఆయనతో నేను మిర్చి సినిమా చేశాను. అందులో టైటిట్ సాంగ్‌కు స్టెప్పులు వేశా. ఇక ఆ మూవీ అనంతరం నేను వేరే చిత్రంలో బిజీ అయిపోయాను. రిలీజ్ టైంలో కూడా హైదరాబాద్‌లో లేను. కొన్ని రోజుల తర్వాత వేరే సినిమా షూటింగ్ పని మీద హైదరాబాద్‌కి రాగా… ఓ పార్టీలో ప్రభాస్ కలిశాడు.
‘మిర్చిలో నీ సాంగ్ సూపర్ హిట్ అయింది తెలుసా?’ అని అడిగారు. దానికి నేను మూవీ చూడలేదు అని చెప్పాను. దీంతో ఆయనే స్వయంగా టికెట్ బుక్ చేసి సినిమా చూడమని చెప్పారు. అలాగే ఏ టైంకి ఆ సాంగ్ వస్తుందో కూడా చెప్పడంతో.. కరెక్ట్‌గా అదే టైంకి వెళ్లి సినిమా చూశాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హంస నందిని కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.