ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి ఆయన పూర్తిగా కామెడీ హారర్ జోనర్లో కనిపించబోతున్నాడనే సంగతి అభిమానులకి తెలిసిన విషయమే. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తుండగా, మూవీ టీమ్ నుంచి ఒక పెద్ద అప్డేట్ రాబోతోందన్న వార్తలు ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నాయి.
సినిమా టీజర్ త్వరలో రిలీజ్ కానుందని, అందుకోసం ప్రభాస్ ఇప్పటికే తన డబ్బింగ్ పూర్తిచేశాడని సమాచారం. టీజర్ విడుదల తేదీ ఎప్పుడు అయినా బయటకు రావొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల ప్రభాస్ అభిమానులు మరింత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడు. హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తుండగా, సంజయ్ దత్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను కూడా త్వరలో ప్రకటించనున్నట్టు సమాచారం.
సరదా, హార్రర్ కలిసిన కథతో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ ప్రభాస్ కెరీర్లో ఒక స్పెషల్ మూవీ అవుతుందా అన్నది అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.