ప్రభాస్‌ వచ్చేది అప్పుడే!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కల్కితో సూపర్‌ హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1100 కోట్లు కలెక్ట్‌ చేసింది.
 ఆ జోష్ లోనే మారుతీ దర్శకత్వంలో రాజసాబ్ అనే సినిమాను మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో రెబల్‌ స్టార్‌ ఫుల్‌  బిజీబిజీగా ఉన్నాడు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత అధిక వ్యయంతో  ఈ సినిమాని రూపొందిస్తుంది.. థమన్ సంగీత దర్శకునిగా వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది రాజసాబ్.

ఇదిలా ఉండగా అందాల రాక్షసి, సీతారామం వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన హను రాఘవ పూడి తో “ఫౌజి” అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా చిత్రంగా రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇప్పటికే మొదటి షెడ్యుల్ చేశారు. ప్రభాస్ లేని సీన్స్ తీస్తున్నారు.

కాగా ఈ నెల 15 నుండి రెండో షెడ్యుల్ రెండో షెడ్యూల్ మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో కూడా ప్రభాస్ జాయిన్ అవ్వట్లేదని తెలుస్తోంది. మిగిలిన నటీనటులతో వచ్చే సీన్స్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు హను. అయితే డిసెంబర్ నుండి ప్రభాస్‌ షూట్ లో జాయిన్ అవ్వనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు సాంగ్స్ కంప్లీట్ చేసి ఇచ్చేశారు సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్.

Related Posts

Comments

spot_img

Recent Stories