పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “ది రాజాసాబ్” కూడా ఒకటి. మరి చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న హారర్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది కావడంతో మళ్ళీ పాత ప్రభాస్ ని చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాని మేకర్స్ ఈ ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
కానీ ఇది వాయిదా పడింది. ఇక కొత్త రిలీజ్ డేట్ ఏంటి ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ ఈ కొత్త రిలీజ్ డేట్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో ఇపుడు వినిపిస్తుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ ఉగాది కానుకగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ఏంటి అనేది రివీల్ చేస్తారని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.