రాజా సాబ్‌ కోసం ఆ ఓటీటీ సంస్థ 100 కోట్ల డీల్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాల్లో “ది రాజా సాబ్” అనే సినిమా పై సినీ ప్రపంచంలో మంచి హైప్ ఏర్పడింది. ఈ సినిమాను మారుతీ తెరకెక్కిస్తుండగా, ఇది హారర్, రొమాన్స్, ఫన్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన ఎంటర్టైనర్‌గా రాబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడగా, తాజాగా ఓటీటీ డీల్స్ విషయంలో ఈ సినిమా మీద భారీ ఆసక్తి కనిపిస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం, ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకు గట్టి ఆఫర్ ఇచ్చిందట. ఒక్క హిందీ వెర్షన్ హక్కులకే 100 కోట్లకు పైగా ఇవ్వాలని వారు భావిస్తున్నట్టు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

ఒకే భాష కోసం ఇంత పెద్ద ఆఫర్ రావడం చూస్తే, ఈ సినిమా మీద ఎంతటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. అయితే ఈ డీల్ ఎంతవరకు నిజమో అధికారికంగా తెలియాల్సి ఉంది.

ఇక సినిమాకు థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తయితే, డిసెంబర్ 5న థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్ ఉన్నట్టు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories