పాన్ ఇండియా హీరోగా క్రేజ్ దక్కించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ చిత్రాన్ని చేస్తుండగా, మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో కూడా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఫౌజీ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జోరుగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఒక భారీ యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. టింబర్ డిపో బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అవుతుందట. ఇది మాస్ ఆడియన్స్‌కి స్పెషల్ ఫీల్ ఇస్తుందని టీమ్ అభిప్రాయపడుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్గా ఇమాన్వి తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నాడు. భారీ నిర్మాణ విలువలతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్, మాస్ కంటెంట్ తో పాటు ప్రభాస్ స్టైల్ హై లైట్ అయ్యేలా ఈ సినిమా రూపొందుతోందన్న టాక్ ఫిల్మ్ సర్కిల్లో జోరుగా వినిపిస్తోంది.