“సలార్” మెంటల్ మాస్ క్రేజ్

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన రీసెంట్ చిత్రాల్లో అభిమానులకి సహా మాస్ ఆడియెన్స్ కి ఒక డ్రగ్ లా ఎక్కేసిన మాస్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా “సలార్” సినిమానే అని చెప్పాలి. సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా సాలిడ్ వసూళ్లు అందుకొని మాస్ ఆడియెన్స్ లో నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అయ్యింది. అయితే అసలు ఆడియెన్స్ లో సలార్ ఫీవర్ ఎలా ఉందో ఇపుడు ఒక వీడియో వైరల్ అవుతుంది.

మామూలుగా ఏదన్నా కాలేజ్ లేదా యూనివర్సిటీస్ లో ఏవైనా ఫంక్షన్స్ కి పాటలు, స్కిట్స్ లాంటివి స్టూడెంట్స్ చేస్తుంటారు కానీ తమిళనాట ఓ వేల్ టెక్ యూనివర్సిటీలో ఏకంగా సలార్ సినిమాలో కోల్ మైన్ ఫైట్ సీక్వెన్స్ ని అలాగే కాటేరమ్మ ఎపిక్ షాట్ ని కూడా రీక్రియెట్ చేసేసారు. దీనితో ఇది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నడుమ ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. అయితే ఇది మన తెలుగు ఆడియెన్స్ నుంచి కాకుండా తమిళ్ ఆడియెన్స్ లో జరగడం మరింత విశేషం కాగా సలార్ మాస్ క్రేజ్ బయట ఎలా ఉందో దీనితోనే అర్ధం అవుతుంది అని చెప్పవచ్చు.

Related Posts

Comments

spot_img

Recent Stories