టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి పై మాట తారుమారు చేస్తునే ఉన్నాడు. ఇప్పటికే ఎన్నో సార్లు పెళ్లి పై ఎన్నో రూమర్లు వచ్చాయి. కానీ డార్లింగ్ మాత్రం స్పందించలేదు. తాజాగా కల్కి ఈవెంట్ లో పెళ్లి పై ఎట్టకేలకు ప్రభాస్ ఓపెన్ అయ్యాడు.
ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. గతంలో ప్రభాస్ పెళ్లి గురించి కొన్ని వార్తలు వినిపించాయి. ఇకపోతే ఆది పురుష్ సినిమా చేస్తున్న సమయంలో కృతి సనన్ తో కూడా పెళ్లి పీటలేకబోతున్నట్లు వార్తలు వచ్చాయి.. కానీ ప్రభాస్ మాత్రం ఎక్కడా వీటి గురించి స్పందించలేదు. కేవలం సినిమాల పై మాత్రమే ఆయన ఫుల్ ఫోకస్ పెట్టారు.
యంగ్ రెబల్ స్టార్ కల్కి సినిమా తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే డార్లింగ్ ఇంస్టాగ్రామ్ లో ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని పోస్ట్ చేశాడు.. ప్రభాస్ లైఫ్ లోకి ఏదో అమ్మాయి వస్తుంది అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అసలు విషయానికి వస్తే ఆయన సినిమా ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రమోషన్స్ కోసం ఆయన ఆ పోస్టు పెట్టాడు ప్రభాస్. కల్కి ఈవెంట్ లో డార్లింగ్ పెళ్లి గురించి సంచలన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.
యాంకర్ సుమ ఈ పోస్ట్ గురించి అడిగింది.. అమ్మాయిలు బాధ పడతారని ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని చెప్పాడు.. కానీ పెళ్లి చేసుకుంటాడా.. లేదా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.