యంగ్ రెబల్ స్టార్ గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఓ వార్త నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. ఈ విషయం ఎంత వరకు నిజము అనేది తెలియదు కానీ… ఈ విషయం మాత్రం తెగ వైరల్ అయిపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.
ఈ సినిమాని త్వరలో విడుదలకు సిద్దంగా ఉందని చిత్ర బృందం తెలిపింది. అయితే ప్రస్తుతం ప్రభాస్ లండన్ లో ఓ ఇంటిని రెంట్ తీసుకుని ఉంటున్నాడు. రాధేశ్యామ్ సినిమా నిర్మిస్తున్న సమయంలో కూడా ప్రభాస్ ఇంటిని రెంట్ కి తీసుకుని ఉన్నాడు. ఆ తరువాత ఆయన కాలుకి ఆపరేషన్ జరిగిన సమయంలో కూడా ఆయన లండన్ లో చాలా రోజుల పాటు ఉండిపోవాల్సి వచ్చింది.
ఆ సమయంలో ఆయన అద్దెకు తీసుకున్న ఇంటికి నెలకు రూ. 40 నంఉచి 50 లక్షల వరకు చెల్లించేవాడని తెలిసింది. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ సినిమా షూటింగ్ కు కూడా ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఇప్పుడు తాజాగా ప్రభాస్ ఆ ఇంటిని ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
ఇక పై యూరప్ వచ్చిన ప్రతిసారి ప్రభాస్ అక్కడే ఉంటారని సోషల్ మీడియాలో వార్తలు తెగ తిరిగేస్తుంది. అయితే ఈ విషయం గురించి మాత్రం ఇప్పటి వరకు అటు ప్రభాస్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పటి వరకు అటు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, అభిషేక్ బచ్చన్, సైఫ్ అలీఖాన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్లకు మాత్రమే విదేశాల్లో సొంత ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు వారి చెంతకు ప్రభాస్ కూడా చెరడంతో ఆయన అభిమానులు ఈ విషయంలో గర్వంగా ఫీల్ అవుతున్నారు.