యంగ్ రెబల్ స్టార్ తాజాగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే. ఇప్పటికే 1200 కోట్ల బిజినెస్ ను రాబట్టింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి.
తాజాగా ప్రభాస్ నటించే నెక్ట్స్ సినిమా పై క్రేజీ అప్ డేట్ ఒకటి ఫ్యాన్స్ ను పండగ చేసుకునేలా చేస్తోంది. అదేంటి అంటే. ‘కల్కి’ సినిమా తర్వాత ప్రభాస్ కొంత గ్యాప్ తీసుకుని మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’తో తిరిగి రాబోతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. తాజాగా చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదలైంది.
ఆ గ్లింప్స్ కి భారీగా రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దీని తరువాత ప్రభాస్ ఓ పీరియాడిక్ డ్రామా సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా 2026 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీని తర్వాత అతను సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ , ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ 2 సినిమాల్లో చేయబోతున్నారు. కేవలం ఈ నాలుగు సినిమాలే కాకుండా ప్రభాస్ ఖాతాలో కల్కి 2 కూడా ఉంది. ఈ చిత్రానికి సీక్వెల్‌ను ఆ సినిమా టీం ఎప్పుడో ప్రకటించింది. నాగ్ అశ్విన్ త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పనులను మొదలు పెట్టనున్నారు.
మొదటి పార్ట్‌తో పాటు రెండో పార్ట్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా ఇప్పటికే షూట్ చేశారట. అయితే ఈసారి ఏ ప్రపంచాన్ని ఎలా చూపిస్తాడో అని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇది కాకుండా ఆయన హను రాఘవపూడి తీయబోయే చిత్రం ‘ఫౌజీ’లో నటిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి అనేక అప్డేట్లు ఎప్పటికప్పుడు అభిమానుల ముందుకు వస్తున్నాయి. ఈ చిత్రంలో సుభాష్ చంద్రబోస్ పాత్రలో ఆయన నటిస్తారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.. మరి ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది.
ఫౌజీ చిత్రం అపూర్వమైన చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో.. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు జరిగిన యుద్ద కథను చూపించబోతున్నారు. అంతేకాకుండా ఈ ఫౌజీ సినిమాలో ప్రేమకథ హృదయానికి హత్తుకునేలా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ పాత్రలో ఆయన నటిస్తారని గతంలోనే టాక్ వినిపించింది. అయితే, ఇది సుభాష్ చంద్రబోస్ కాలాన్ని చూపుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు సమాచారం.