ఏంటీ …ప్రభాస్‌ అంత తీసుకున్నాడా!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మైథలాజికల్ చిత్రం ‘కన్నప్ప’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నాడు. ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డా.మోహన్ బాబు దాదాపు రూ.140 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

అయితే, ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. దీంతో వారు ఈ సినిమాకు ఎంతమేర రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా.. అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ విషయంపై మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కోసం ప్రభాస్, మోహన్ లాల్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని ఆయన చెప్పారు.

తన తండ్రి మోహన్ బాబుపై ఉన్న అభిమానం, ప్రేమతో వారు ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించారని.. వారు ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని మంచు విష్ణు తెలిపారు. దీంతో ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఇలా కేవలం అభిమానంతో జీరో రెమ్యునరేషన్‌తో సినిమా చేయడం విశేషమని నెట్టింట టాక్ నడుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories