నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..బోయపాటి డైరెక్షన్‌లో మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్!

బాలయ్య-బోయపాటి డెడ్లీ కాంబో. ఈ ఇద్దరి కాంబోలో మూవీ వచ్చిందంటే ఫ్యాన్స్‌కు పూనకాలు ఫిక్స్‌.అయితే ఈ పూనకాలు 10 రెట్లు పెరిగేలా మరో న్యూస్‌ బయటకు వచ్చింది. అది బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి సంబంధించిన న్యూస్. నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ ఏడాదే తన కుమారుడు హీరోగా అరంగేట్రం చేస్తాడని స్వయంగా బాలయ్య ధృవీకరించడంతో అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ  ఇవ్వబోతున్నారు. బోయపాటి డైరెక్షన్‌లో మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్‌ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బోయపాటితో మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించిన స్టోరీ లైన్ కు సంబంధించిన చర్చలు జరగడం నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది.

బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ తొలి సినిమా రానుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రానప్పటికీ ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో మోక్షజ్ఞ హీరోగా ‘ఆదిత్య 369’ అనే సినిమా తెరకెక్కనుందని, దానికి సీక్వెల్ రాబోతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మోక్షజ్ఞ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా రాబోతుందని వార్తలు రావడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది

Related Posts

Comments

spot_img

Recent Stories