పూజా ఔట్‌..శ్రుతి ఇన్‌..!

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్డే, చివరిసారి మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య సినిమాలో కనిపించింది. ఆ సినిమా తర్వాత ఆమె తెలుగులో మరో ప్రాజెక్ట్ చేయలేదు. అయితే తాజాగా విడుదలకు సిద్ధమైన రెట్రో సినిమా ప్రమోషన్స్‌లో పూజా తాను త్వరలోనే తెలుగు సినిమాల్లో మళ్లీ కనిపించబోతున్నానని చెప్పింది. ఒక లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, అదే తన రీ-ఎంట్రీ ప్రాజెక్ట్ అవుతుందని కూడా వెల్లడించింది.

ఈ వ్యాఖ్యల తర్వాత చాలా మంది పూజా హెగ్డే, దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా కనిపిస్తుందని భావించారు. కానీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ ఆ సినిమాలో తనే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చెప్పింది. దీంతో పూజా ఎక్కడ కనిపించబోతుంది అనే ప్రశ్న మళ్లీ హాట్ టాపిక్ అయింది.

Related Posts

Comments

spot_img

Recent Stories