మరో క్రేజీ ఆఫర్‌ పట్టేసిన పూజా!

టాలీవుడ్‌లో ఓ టైంకి వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ల లిస్టులో నిలిచిన పూజా హెగ్డే, కొంత గ్యాప్ తర్వాత మళ్లీ తన సినిమాలతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మధ్యకాలంలో తెలుగు కంటే ఎక్కువగా తమిళ్ సినిమాలపై ఫోకస్ పెంచిన ఆమె, రీసెంట్‌గా సూర్య హీరోగా నటించిన “రెట్రో” సినిమాతో తెరపై కనిపించింది.

ఇక ప్రస్తుతం ఆమె తమిళ్ లోనే మరో రెండు ప్రాజెక్ట్స్ “కూలీ” మరియు “జన నాయగన్” లో కూడా నటిస్తోంది. ఈ రెండు సినిమాలూ మంచి క్రేజ్ ను తెచ్చుకున్న ప్రాజెక్ట్స్ కావడంతో, పూజా కెరీర్ మళ్లీ జోరందుకుంటుందని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే, తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పూజా హెగ్డే త్వరలోనే నటుడు ధనుష్ తో జతకట్టబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇటీవలే “కుబేర” సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన ధనుష్, ఒక హిందీ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు తన తదుపరి చిత్రానికి ప్లానింగ్ చేస్తున్న సమయంలో పూజాను హీరోయిన్ గా తీసుకోవాలని టీం ప్లాన్ చేస్తోందన్న గాసిప్ బలంగా వినిపిస్తోంది.

ఇప్పటికి ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ రావల్సి ఉన్నా, ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో ఓ రేంజ్ లో ఇంట్రెస్ట్ ఏర్పడుతోంది. పూజా హెగ్డేకి ఇది మళ్ళీ మంచి టర్నింగ్ పాయింట్ కావచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories