రాజకీయమే టార్గెట్.. సంచలన సృష్టి దుర్బుద్ధి మార్గం!

పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకునే వాళ్లు.. పార్టీల అధినేత కళ్లలో పడాలి. అందుకు ఎవరి మార్గాలు వారికి ఉంటాయి. అధినేతలను ప్రసన్నం చేసుకోవడానికి భారీ కార్యక్రమాలు నిర్వహించేవాళ్లు, వ్యక్తిగతంగా కలిసి కోట్లుకు కోట్ల రూపాయల ముడుపులు సమర్పించుకునేవాళ్లు.. వారి కళ్లలో ఆనందం చూడడం కోసం నాయకుల బర్త్ డేలకు రక్తదానం చేసేవాళ్లు ఇలా రకరకాలుగా ఉంటారు. అలాంటి ప్రయత్నాల్లో భాగమే.. రాజకీయ ప్రత్యర్థులను తమ తాహతుకు మించి తిట్టడం, నిందించడం బురద చల్లడం ద్వారా.. తాము కోరుకున్న పార్టీ అధినేత కళ్లలోపడడం. ఇప్పుడు తిరుపతిలో పనిచేస్తున్న ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి కూడా ఇలాంటి ఎత్తుగడలకే పాల్పడుతున్నట్టు కనిపిస్తోంది. కేంద్రంలో మోడీని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, అమరావతి నిర్మాణ ప్రాజెక్టును, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను అందరినీ వరుసపెట్టి తన ఫేస్ బుక్ ఖాతాలో అడ్డగోలుగా తిట్టడం ద్వారా ఆ అధికారి రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తున్నాడు. కేంద్రం ఎన్నికల సంఘాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డిని తప్ప ప్రతిఒక్కరినీ తిట్టిపోస్తున్న అతని తీరు గమనిస్తే రాజకీయ టార్గెట్ ఏంటో అర్థమైపోతుంది.

సంచలనాలు నమోదు చేస్తున్న ఆ అధికారి తీరు వివాదాస్పదం అవుతోంది. తిరుపతిలో వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట కమిషనర్ గా ఎస్. సుభాష్ చంద్రబోస్ పనిచేస్తున్నారు. ఆయన సోషల్ మీడియా మొత్తం ప్రభుత్వాల మీద నిందలతో నిండిపోయి ఉంటుంది. కాంగ్రెస్ ఓట్ల చోరీ అంశాన్ని లేవనెత్తిన తర్వాత.. ఆయన ఎన్నికల సంఘం కమిషనర్ల గురించి ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టారు. ‘అసలు వీళ్లు చ చదువుకున్నారా లేదా.. ఇంత బుర్ర తక్కువ కాబట్టే వీళ్లను నియమించుకున్నారా?.. సూటిగా సమాధానం చెప్పలేని అసమర్థత వల్ల.. రాహుల్ ఓట్ చోరీ విమర్శలే సరైనవని నిరూపిస్తున్నారు’ అంటూ పోస్టు పెట్టారు. తెలంగణలో గో బ్యాక్ మార్వాడీ అనే వివాదం నడుస్తుండగా.. ఈ అధికారి అక్కడి కేంద్రమంత్రి బండి సంజయ్ ను ఉద్దేశించి.. ‘దేశంలోకి రోహింగ్యాలు వస్తుంటే.. ఏం నువ్వు గుట్కా నములుతు కూర్చున్నావా’ అంటూ పోస్టు పెట్టడం గమనార్హం.

పవన్ కల్యాణ్ మీద కూడా ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు అనేకం చేశారు. ఆయన అమరావతి రాజధానిపై పెట్టిన వివాదాస్పద, అభూత కల్పనలతో కూడిన పోస్టులు సర్వీసు నిబంధనలకు విరుద్ధం అని తెలిసినప్పటికీ.. ఆయన తన పోస్టులను ఫేస్ బుక్ నుంచి తొలగించను కూడా లేదు. అయితే.. ఈ వివాదాస్పద అధికారి కేవలం జగన్మోహన్ రెడ్డి గుడ్ లుక్స్ లో పడి రాజకీయ భవిష్యత్తు వైపు అడుగులు వేయడానికే ఇలాంటి తప్పుడు పోస్టులు పెడుతూ సంచలనం సృష్టిస్తున్నారని.. ఆయన రేపో మాపో సస్పెండ్ చేయడానికి అధికారులు ఆదేశాలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories