పొలిటికల్ పంచులు..?

పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా పై ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్నాయి. చారిత్రాత్మక యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పవన్ ఈ సినిమాకు సంబంధించిన తన పాత్రను పూర్తి చేశారు.

ఈ సినిమాలో పవన్ డైలాగులు సామాన్య ప్రేక్షకులను కాకుండా, రాజకీయ నేపథ్యాన్ని స్పృశించేలా ఉండబోతున్నాయంటూ టాక్ వినిపిస్తోంది. కథలో భాగంగా కొన్ని డైలాగులు పవన్ రాజకీయ వైఖరిని ప్రతిబింబించేలా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఒక డైలాగ్‌– డబ్బు లేదా పదవుల కోసం తన విలువలను మార్చుకోడు అన్న భావనతో నడిచేలా ఉంటుందని సమాచారం. ఇది పవన్ వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉండటంతో అభిమానులను బాగా ఆకట్టుకునే అవకాశం ఉందని చిత్ర బృందం భావిస్తోంది.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, ఏ.ఎం. రత్నం నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. రాజకీయ టచ్‌తో కూడిన పవన్ డైలాగులు, పవర్‌ఫుల్ పాత్ర, చారిత్రాత్మక నేపథ్యం ఈ సినిమాపై అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories