పోలవరం అంటే వైఎస్సార్’.. చెప్పుకోడానికి సిగ్గుండాలి!

ఇప్పుడు చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు మీద పెడుతున్న శ్రద్ధ, పనులను పురమాయిస్తున్న తీరు గమనిస్తే.. ఈ అయిదేళ్లలో ఆ ప్రాజెక్టును చంద్రబాబునాయుడు పూర్తిచేసేసి నీళ్లందిస్తారనే అభిప్రాయం ఎవ్వరికైనా కలుగుతుంది. పోలవరం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకోవడం మాత్రమే కాదు.. జగన్ ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని కూడా చంద్రబాబు బాగానే ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు నాయుడు ఎక్కడ క్రెడిట్ కొట్టేస్తారో అని వైసీపీ నాయకులు కంగారు పడుతున్నారు. ఈ ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర రెడ్డి సంకల్పించినది అని చెబుతూ.. ‘పోలవరం అంటే వైఎస్సార్.. వైఎస్సార్ అంటే పోలవరం’ అని నాటకీయమైన నినాదాలు చేస్తున్నారు. ఇలాంటి డ్రామా డైలాగులు వల్లించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు సిగ్గులేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి బుర్రలో మాత్రమే పుట్టిన ఆలోచన కానేకాదు. ఆయనకుముందునుంచి కూడా ఈ ప్రాజెక్టు గురించిన ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయి. వైఎస్సార్ వచ్చిన తర్వాత కీలకమైన తొలి అడుగులు పడ్డాయని మాత్రం ఒప్పుకోవాలి. కానీ ఆయన ఆ ప్రాజెక్టుకు మేజర్ కంట్రిబ్యూషన్ చేయలేకపోయారు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి.. పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మిస్తాం అని చెప్పిన తర్వాత.. నిధులకు కాస్త మార్గం దొరికింది. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ప్రతిసోమవారం పోలవారంగా పాటిస్తూ.. పనులను వేగంగా నడిపించడం వల్ల.. అంతో ఇంతో ఈ దశకు వచ్చింది. పోనీ చంద్రబాబునాయుడు కష్టం మొత్తం అబద్ధం అనే అనుకుందాం.
‘పోలవరం అంటే వైఎస్సార్’ అని ఇవాళ పెద్దపెద్దగా అరుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు.. తాము అయిదేళ్లు పరిపాలించి.. వైఎస్సార్ కలను నెరవేర్చడానికి ఏం పనిచేశారు. తమ శ్రద్ధను ఏమాత్రం నిరూపించుకున్నారు? తన తండ్రి స్వప్నం అనిచెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్టును కూడా సమాధిగా మార్చేసిన దుర్మార్గమైన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోయారు. పనులు పూర్తయితే చంద్రబాబునాయుడుకు క్రెడిట్ వస్తుందనే దుర్మార్గమైన ఆలోచనతో అటు అమరావతి రాజధానిని, ఇటు పోలవరం ప్రాజెక్టును కూడా సర్వనాశనం చేసేసిన వ్యక్తి ఆయన! ఇప్పుడ పోలవరం అంటే వైఎస్సార్ అని చెప్పుకోవడానికి ఆ పార్టీ నాయకులకు సిగ్గుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories