సర్వత్రా విషమే: బనకచర్లకు మోకాలడ్డుతున్న జగన్!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు ఆయన కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నా సరే.. రాష్ట్రానికి చేటు చేయడానికే చూస్తున్నాయి. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి, రాయలసీమకు నీళ్లందించడానికి కూటమి ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును సంకల్పిస్తే.. జగన్మోహన్ రెడ్డి దానికి కూడా అడ్డు తగులుతున్నారు. బనకచర్ల నిర్మించడం సబబు కాదని, సరైన ఆలోచన కాదని ఆయన తన అభిప్రాయం వెల్లడిస్తున్నారు. చూడబోతే.. రాష్ట్ర సంక్షేమం విషయం పక్కకు నెట్టేసి.. కూటమి ప్రభుత్వం ఏం చేసినా సరే.. దానిని అడ్డుకోవడం ఒక్కటే తన జీవితలక్ష్యంగా జగన్ వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా వందలాది నకిలీ మెయిల్స్ పెట్టుబడిదార్లకు పంపి.. అడ్డుకోవాలని చూసిన కుట్ర దళాలకు అధిపతి జగన్. తన హయాంలో ఏమీ చేయకపోగా.. రాష్ట్రానికి కూటమి ప్రభుత్వ పాలనలో కూడా కొత్త పరిశ్రమలు రాకుండా ఆయన అడ్డుకుంటున్న తీరును అందరూ గమనిస్తూనే ఉన్నారు. కేవలం పరిశ్రమలు మాత్రమే కాదు.. తన సొంతదైన రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సంకల్పిస్తున్న నీటి ప్రాజెక్టులను కూడా అడ్డుకుంటాననే దుర్బుద్ధులను ఆయన ఇప్పుడు చాటుకుంటున్నారు.

జగన్ ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో బనకచర్లపై తన వైఖరి చెప్పాలని జాతీయ మీడియా ఆయనను సూటిగా ప్రశ్నించింది. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి.. సూటిగా సమాధానం ఇవ్వకుండా డొంకతిరుగుడు మార్గాన్ని ఆశ్రయించారు. గోదావరి నుంచి ఏటా సముద్రంలో వృథాగా కలిసిపోతున్న మూడువేల టీఎంసీల వరద జలాలనుంచి కేవలం 200 టీఎంసీలను వాడుకోవడానికి మాత్రమే తాము ఈ ప్రాజెక్టు సంకల్పిస్తున్నట్టుగా చంద్రబాబు సర్కారు చెబుతోంది.  అయితే ఈ విషయాలన్నీ మాట్లాడకుండా.. జగన్ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించారని, అలా తగ్గించడం వల్ల నష్టం జరుగుతుందని ఏదేదో మాట్లాడడం తమాషాగా ఉంది.
అదే సమయంలో.. ఇంద్రావతి నుంచి గోదావరిలోకి వస్తున్న నీటిని ఛత్తీస్ గఢ్ అడ్డుకుంటోందని, ప్రాణహిత నుంచి గోదావరిలోకి నీళ్లు రావడం ప్రశ్నార్థకంగా మారుతోందని ఇలాంటి సమయంలో గోదావరి మిగులు జలాలపై లెక్కలు తేలకుండా బనకచర్ల నిర్మించడం కరెక్టు కాదని జగన్ అంటున్నారు.

కేవలం వరద జలాలను వాడుకోవడానికి మాత్రమే బనకచర్ల నిర్మిస్తాం అంటూ.. చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి చాలా స్పష్టమైన లెక్కలు సమర్పించింది. అందుకోసం గత వందేళ్ల మిగులు జలాల, వృథాగా సముద్రంలో కలుస్తున్న జలాల లెక్కలనుంచి సగటులు తీసి రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది. జగన్ మోహన్ రెడ్డి.. మిగులు జలాల లెక్క తేలాలంటూ ఇప్పటికీ సన్నాయి నొక్కులు నొక్కడం బనకచర్లను అడ్డుకోడానికే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒకవేళ జగన్ కు నిజంగానే తన వాదన మీద నమ్మకం ఉంటే.. ప్రభుత్వం సమర్పించిన  మిగులు జలాల గణాంకాలు తప్పులని, అవి అభూత కల్పనలనీ నిరూపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తన హయాంలో ఏమీ చేయలేకపోగా, చేసే ప్రభుత్వాన్ని అడ్డుకోవడం సరికాదని అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories