సంక్రాంతి వేడుకల్లో మెగాస్టార్‌!

కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి న్యూఢిల్లీలోని తన నివాసంలో సంక్రాంతి పండుగ వేడుకలను ఎంతో ఘనంగా జరిపారు. తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ వేడుకలను కిషన్ రెడ్డి ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి   రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా  చాలా మంది హాజరయ్యారు.

ఈ వేడుకులకు సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు యంగ్ హీరో తేజ సజ్జా కూడా హాజరయ్యారు. ఇక ఈ సంక్రాంతి వేడుకలకు ముఖ్య అతిథిగా దేశ ప్రదాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. ప్రధాని మోదీ చిరంజీవిని ఆప్యాయంగా పలకరించడం అందరినీ ఆకట్టుకుంది. చిరుతో కలిసి జ్యోతిప్రజల్వన చేసిన మోదీ, చిరంజీవితో చాలాసేపు మాట్లాడారు.

ఇలా దేశప్రదాని చిరంజీవికి ప్రత్యేక మర్యాదను ఇవ్వడం ప్రస్తుతం  ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ వేడుకలో చిరు పంచెకట్టుతో అందరి దృష్టిని ఆకర్షించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories