దయచేసి ఆ పని చేయకండి!

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ తన నెక్స్ట్ ప్రాజెక్టును రెడీ చేసేందుకు తయారవుతున్నాడు. ఈ సినిమాని దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో  పెరిగాయి. ఇక ఈ సినిమా కోసం మహేశ్ ప్రస్తుతం తన లుక్ కోసం తెగ కష్టపడి రెడీ అవుతున్నాడు.

అయితే, మహేశ్ ఈ సినిమాతో బాలీవుడ్ ఆడియెన్స్‌కు తొలిసారిగా పరిచయం అవుతున్నాడు. మహేశ్ చేసిన ఏ సినిమా కూడా నేరుగా హిందీలో విడుదల కాలేదు. రాజమౌళి సినిమాతో ఆయన డైరెక్ట్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో, ఈ సినిమా విడుదల అయ్యే వరకు తన పాత సినిమాలేవీ కూడా హిందీ డబ్ చేయొద్దని మహేశ్ ఆ సినిమాల నిర్మాతలను కోరినట్లుగా సమాచారం.

ఇక రాజమౌళితో మహేశ్ చేయబోయే సినిమా అడ్వెంచర్ త్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉంటుందని.. ప్రస్తుతం క్యాస్ట్ సెలెక్షన్ కోసం కసరత్తులు సాగుతున్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories