టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇపుడు తన కొడుకు అకిరా నందన్ తో కలిసి పలు పుణ్య క్షేత్రాలు సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇలా లేటెస్ట్ గా ప్రయగరాజ్ మహా కుంభమేళాకి కూడా పవన్ తన కుటుంబంతో హాజరు కావడం అనేది వైరల్ గా మారింది.
పవన్ కుంభమేళా పవిత్ర స్నానం కోసం తాను, తన భార్య అనా లేజీనోవా అలాగే అకిరా కూడా కనిపించిన విజువల్స్ ఇపుడు నేషనల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. అయితే వీరితో పాటుగా పవన్ సన్నిహితుడు టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కలిసి స్నానమాచరించిన దృశ్యాలు అభిమానుల్లో ఆసక్తిగా మారాయి. ఇక ప్రస్తుతం పవన్ నటించిన భారీ సినిమా హరిహర వీరమల్లు నుంచి రెండో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేస్తుండగా దీనికోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.