పేర్ని ఫ్యామిలీ: తప్పించుకోవడం ఈజీ కాదు!

తమ పాపాలు ఎక్కడ బయటపడిపోతాయో అనే భయంతో.. ముందుగా ప్రభుత్వానికి లేఖ రాస్తే పరిశుద్ధులం అయిపోతామని వారు భ్రమపడ్డారు. ముందే చెప్పేసినంత మాత్రాన పాపం- నేరం కిందకు మారదు అని ఆశించారు. అధికారులు నోటీసులు ఇచ్చీ ఇవ్వకముందే దాదాపు రెండు కోట్ల రూపాయల జరిమానా కట్టేసి అక్కడితో చేతులు దులిపేసుకోవచ్చు అని అనుకున్నారు. కానీ అదేమీ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. పేర్ని వెంకట్రామయ్య కుటుంబంలో ఎవరో ఒకరు జైలుకు వెళ్ళడం తప్పేలా లేదు. జరిమానా కట్టినా సరే అరెస్టు భయంతో భార్య జయసుధ తరఫున ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసుకుని ఎట్టకేలకు కృతకృత్యులైన పేర్ని నాని చివరికి తానే కేసులో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఆయన అరెస్టు తప్పదనే ప్రచారం రాజకీయ వర్గాలలో నడుస్తోంది.

బియ్యం స్మగ్లింగ్ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన తర్వాత.. నా గోడౌనులో ప్రభుత్వం నిల్వ ఉంచిన రేషన్ బియ్యం కనిపించడం లేదంటూ పేర్ని నాని ప్రభుత్వానికి లేఖ రాయడం.. ఒక పెద్ద కామెడీ. పూర్తి విచారణ చేయకుండానే.. ఆయన పేర్కొన్న మేరకు ‘సరే అయితే.. జరిమానా కట్టేయండి’ అంటూ అధికారులు నోటీసు పంపడం ఇంకో కామెడీ. ప్రభుత్వం సీరియస్ అవుతున్న తీరును బట్టి.. జరిమానా కట్టేసినా సరే..  భార్య పేరుతో ముందస్తు బెయిలు పిటిషను వేసుకున్నారు పేర్ని నాని. తాజాగా బెయిలు కూడా వచ్చింది. కానీ.. ఈలోగా.. అసలు ఈ స్మగ్లింగ్ నేరానికి పేర్ని జయసుధ పేర ఉన్న గోదాములు ఎలా సహకరించాయో.. అందులో పేర్ని నాని పాత్ర ఎంత ఉన్నదో అంతా బయటకు వచ్చింది. ఇప్పటికే అరెస్టు అయిన వ్యక్తుల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి మాజీ మంత్రి పేర్ని నాని పేరును కూడా కేసులో చేర్చారు పోలీసులు.

ఇప్పటికే పేర్ని నాని కుటుంబం పరారీలో ఉంది. ఆయన భార్యకు బెయిలు వచ్చింది గానీ.. వారు అజ్ఞాతంలోంచి బయటకు రాలేదు. ఇప్పుడు నాని కేసులో ఇరుక్కోవడంతో ఇప్పట్లో ఇక వారు.. బాహ్యప్రపంచంలోకి రాకపోచ్చునని ప్రచారం జరుగుతోంది. పేర్ని నాని తరఫున కూడా ముందస్తు బెయిలు పిటిషను దాఖలు చేయడానికి ఆయన న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ నుంచి ఇంకా పెద్దమొత్తంలో జరిమానా కట్టాలని నోటీసులు వచ్చి ఉన్న నేపథ్యంలో.. అది కూడా కట్టేస్తే.. ఇక కేసుల బెడద తప్పిపోతుందా? లేదా, చేసిన పాపం.. జరిమానాలతో చెల్లుబాటు అయ్యేది కాదా? అనే మీమాంసలో పేర్ని కోటరీ ఇప్పుడు సతమతం అవుతోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories