మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా “పెద్ది” చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. “రంగస్థలం” తరువాత చరణ్ మరోసారి గ్రామీణ నేపథ్యంతో వస్తుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు మేకర్స్ ఎలాంటి రాజీ లేకుండా ముందుకెళ్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన అందిస్తున్న పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై అభిమానుల్లో మంచి ఉత్సాహం కనిపిస్తోంది.
ఇక తాజా సమాచారం ప్రకారం, “పెద్ది” చిత్రంలోని మొదటి పాటను త్వరలోనే విడుదల చేయడానికి టీమ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా కనిపించే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. రెహమాన్ ట్యూన్ ఈ కాంబినేషన్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లేలా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.