గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ కేవలం టైటిల్ పోస్టర్‌తోనే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ డేట్ గ్లింప్స్ శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు(ఏప్రిల్ 6) ఉదయం 11.45 గంటలకు రిలీజ్ చేస్తున్నారు.
దీంతో ఈ గ్లింప్స్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా, ‘పెద్ది ఫస్ట్ షాట్’ అంటూ ప్రమోట్ చేస్తున్న ఈ గ్లింప్స్‌పై హీరో రామ్ చరణ్ తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చాడు. తాను ఈ గ్లింప్స్ చూశానని.. ఇది సూపర్‌గా వచ్చిందని.. ప్రేక్షకులకు ఇది సాలిడ్‌గా నచ్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు బోనస్‌గా మారనుందని ఈ గ్లింప్స్‌తో అర్థమవుతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.
ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.