ఇంటికి చేరుకున్న పవన్‌ తనయుడు!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్  కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పవన్, మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన సింగపూర్ వెళ్లారు. అయితే, అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతను ఇంటికి చేరుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

ఆయన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడని చెప్పుకొచ్చారు. రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డను కాపాడి మా కుటుంబానికి అండగా నిలిచాడు.

ఈ సందర్భంగా  ఊళ్ళల్లో,  ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలిచారు. ఆ బిడ్డ కోసంచాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. మీ అందరికీ నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు, మా కుటుంబం యావన్మంది తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము’ అంటూ చిరంజీవి తన పోస్ట్‌లో వెల్లడించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories