పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్టులలో “హరిహర వీరమల్లు” అనే పాన్ ఇండియా సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పీరియడ్ డ్రామా కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకులు క్రిష్ మరియు జ్యోతికృష్ణలు కలిసి రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ అవుతోంది.
ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ ట్రైలర్ రేపు థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. దీనికి సంబంధించిన ప్రత్యేక స్క్రీనింగ్ కూడా ఇటీవల నిర్వహించినట్టు తెలుస్తోంది. ట్రైలర్‌ని చూసిన పవన్ కళ్యాణ్ చాలా సంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. మొదట చూపిన వెర్షన్‌పై కొన్ని సూచనలు ఇచ్చిన పవన్, తాజా వెర్షన్ చూసిన తర్వాత పూర్తిగా తృప్తి చెందినట్టు యూనిట్ చెబుతోంది.
అలాగే ట్రైలర్‌ను థియేటర్‌లో చూసిన పవన్ కల్యాణ్ తన ఫీలింగ్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేసిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఆ విజువల్స్ ఇప్పుడు ఫ్యాన్స్‌ను రెట్టింపు ఉత్సాహంలో ముంచెత్తుతున్నాయి. ఇక ట్రైలర్ చూసిన త్రివిక్రమ్ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారట. మొత్తానికి చిత్రబృందం అందరూ తమ కంటెంట్ పట్ల చాలా కన్‌ఫిడెంట్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు రేపు వస్తున్న ఈ ట్రైలర్ పవన్ మార్క్ మాస్ మేనరిజం, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.