మీటింగ్‌ మధ్యలో ఆపేసిన పవన్‌!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉన్నారు. సినిమాల షూటింగ్స్, మీటింగ్స్ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ తనేంటో చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తల్లి అంజనాదేవి ఆరోగ్యం బాగాలేదనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కొందరు ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ అపోహలు పెంచారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ కీలక సమావేశం మధ్యలోనే వదిలేసి హుటాహుటిన హైదరాబాద్ వచ్చేశారంటూ ప్రచారం జరిగింది.

అయితే తాజా సమాచారం ప్రకారం, అంజనాదేవి గారికి ఆరోగ్య పరంగా ఎలాంటి పెద్ద సమస్యలు లేవని తెలుస్తోంది. ఆమె క్షేమంగా ఉన్నారని, బయట వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టత వస్తోంది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు.

ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు అనే పీరియాడికల్ యాక్షన్ సినిమా జూలై 24న థియేటర్లలోకి రానుంది. విడుదలకు కేవలం ఓ నెల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. రాజకీయాల మధ్య తన సినిమాలపై కూడా పూర్తి ఫోకస్ పెట్టడం పవన్ స్పెషాలిటీ అనే చెప్పాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories