ఓజీ చూసిన పవన్‌!

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నారో తెలిసిన విషయమే. చాలా గ్యాప్ తర్వాత ఆయన పూర్తి స్థాయిలో నటించిన స్ట్రెయిట్ తెలుగు సినిమా హరిహర వీరమల్లు ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విషయానికొస్తే, చివరి నిమిషంలో పవన్ స్వయంగా కొన్ని మార్పులు సూచించి ట్రైలర్‌ను ఆయన మార్క్ లోకి తీసుకెళ్లినట్టు సమాచారం.

ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరో ప్యాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ‘ఓజి’ కోసం రెడీ అవుతున్నారు. దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే పవన్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తిగా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఫస్ట్ హాఫ్‌ను పవన్ చూశారని, దానిలో కొన్ని సీన్లపై సలహాలు కూడా ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది. ఈ మార్పులతో ఫస్ట్ హాఫ్ పై పవన్ సంతృప్తిగా ఉన్నట్టు అనిపిస్తోంది.

ఇక సంగీతం విషయంలో కూడా మంచి అంచనాలే ఉన్నాయి. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. సౌండ్ ట్రాక్ కూడా సినిమాలో ఓ బలమైన హైలైట్ గా నిలవబోతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తుంది. మొత్తంగా చూసుకుంటే పవన్ ఫ్యాన్స్ కి వరుసగా రెండు సినిమాలు ఒకే సమయం లో అప్డేట్స్ తో వస్తుండటంతో ఈ మధ్యే ఫుల్ ఫెస్టివల్ మూడ్ లో ఉన్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories