పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” ఎప్పటినుంచో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దర్శకులు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణల కలిసి రూపొందిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కొన్ని సాంగ్స్ రిలీజ్ కాగా, తాజాగా నాలుగో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఇప్పుడు వచ్చిన ఈ పాట చాలా చక్కగా, స్మూత్‌గా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ రొమాంటిక్ పాటలను మిస్ అవుతున్న అభిమానులకు ఇది ఖచ్చితంగా ఒక సూపర్ ట్రీట్‌లా ఉంటుందని చెప్పొచ్చు. ఎం ఎం కీరవాణి ఇచ్చిన ట్యూన్స్ కచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఈ పాటకు శ్రీహర్ష రాసిన సాహిత్యం కూడా బాగుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం అంటే, లిప్సిక భాష్యం గానం ఈ సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విజువల్స్ విషయానికి వస్తే, పాటకు తగ్గట్టుగా వేసిన సెట్టింగులు ఆకట్టుకుంటాయి. పాటలో కొన్ని సర్ప్రైజ్ కెమెరా షాట్స్ కూడా కనిపిస్తాయి. నిధి అగర్వాల్ ఈ పాటలో ప్రధాన హైలైట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె గ్లామర్, డాన్స్ మూవ్స్ చూస్తే పాటలో ఆమెకున్న ప్రాధాన్యత అర్ధమవుతుంది.
పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం వీడియోలో ఎక్కువ సీన్లు చూపించకపోయినా, కనిపించిన కొన్ని శాట్స్ చూస్తే మినిమమ్ గానే అయినా ఆకర్షణీయంగా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే, ఈ సాంగ్ చాలా బాగుంది. సింగిల్స్, లేడీస్, రొమాంటిక్ పాటలను ఇష్టపడే ఆడియెన్స్‌కు ఇది మరింత నచ్చేలా ఉంది.