పవన్, ప్రభాస్‌ ల జాతర!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా సినిమా ఓజి థియేటర్లలో విడుదలై భారీ స్పందనను రాబట్టుకుంది. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా మొదటి రోజు నుంచే మంచి హైప్ తో ముందుకు సాగుతోంది. సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులు కూడా థియేటర్లలో పవర్ ఫుల్ అనుభూతిని పొందారని చెప్పాలి.

ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సుజీత్ తన సినిమాటిక్ యూనివర్స్ కి నాంది పలుకుతున్నట్టు ఓజి ద్వారా హింట్ ఇచ్చాడు. ముందే సాహోతో కనెక్షన్ ఉంటుందని వినిపించిన వార్తలు నిజమయ్యాయి. ప్రీమియర్ షోల్లోనే డైరెక్టర్ తాను “ఎస్ సి యూ” అనే కొత్త యూనివర్స్ ని ప్రారంభిస్తున్నట్టు క్లూ ఇచ్చాడు.

సినిమా లో కూడా సాహోతో కలిపి ఒక లింక్ చూపించడం ఫ్యాన్స్ కి మైండ్ బ్లోయింగ్ ఫీలింగ్ ఇచ్చింది. పవన్ అభిమానులతో పాటు రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా థియేటర్లలో జోష్ లోకి వెళ్లిపోయారు. ఈ సర్ప్రైజ్ తో ఓజి రెండో భాగంపై చర్చలు మరింత వేడెక్కాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories